20-09-2025 12:00:00 AM
నిజామాబాద్ సెప్టెంబర్ 19:(విజయ క్రాంతి) నిజామాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా దయాకర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన జర్నలిస్ట్‌గా ప్రస్థానం ప్రారంభించారు.
అనంతరం 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీపీసీసీ సెల్ రాష్ట్ర కోకన్వీనర్‌గా కొనసాగుతున్నారు. కాగా.. దయాకర్ గౌడ్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు.