03-05-2025 04:36:26 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): తమ కాలనీలో మంచినీరు రావడం లేదని అధికారులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోకపోవడంతో ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకురాలు గాయం ఝాన్సీ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో వెంటనే స్పందించి మరమ్మత్తులకు తన వంతు ప్రయత్నం చేసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి ఎస్సీ కొత్త కాలనీలో గత కొన్ని నెలలుగా మంచినీళ్ల కోసం వేసిన పైప్ లైన్ శిథిలావస్థకు చేరుకొని మరమ్మతులకు నోచుకోక పోవడంతో మంచినీరు సప్లై కావడం లేదు. దీంతో ఈ విషయాన్ని పంచాయతీ మండల సంబంధిత అధికారులు,గ్రామ సెక్రెటరీ తో పాటు ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ నాయకురాలు దాయం ఝాన్సీ రాజిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి వరకు తాత్కాలికంగా తన సొంత ఖర్చులతో కాలనీకి వెళ్లే పైప్ లైన్ తవ్వించి మరమ్మత్తులు చేయించారు. దీంతో కాలనీవాసులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.