03-05-2025 04:34:39 PM
- బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ
- విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): నిరుపేదలకు అందిస్తున్న ఇండ్ల కేటాయింపుల్లో ఎంపీ కోట కింద ఎన్ని ఇల్లు ఇస్తారని ఎంపీ డీకే అరుణ(Mahabubnagar MP DK Aruna) ప్రశ్నించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జనగణన విషయంలో కాంగ్రెస్ ది తప్పుడు ప్రచారం చేస్తుందని, జన గణనతో పాటు కుల గనన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రత్మాకమైందన్నారు. కాంగ్రెస్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం కులగరణ చేస్తుందని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ చేసిన కుల గణన ఓ తప్పుల తడక గా ఉందని పేర్కొన్నారు. చాలామంది కులగణలో పాల్గొనలేదని, ఎన్నికల కోసమే కాంగ్రెస్ ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తుందన్నారు. ఓట్ల సీట్ల కోసమే కుల గణన అంటోంది తప్పితే వాళ్ళకి చిత్తశుద్ధి లేదన్నారు.
- 1931లో కుల గణన జరిగింది
మత పరమైన రిజర్వేషన్లు కోరడం కాంగ్రెస్ కుట్రలో భాగమేనని, ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కులగణన డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ముస్లింలను బీసీలలో చేర్చడం అంటే బీసీలను మోసం చేయడమే అన్నారు. బీసీ అభ్యున్నతి కోసం పాటు పడుతున్నది బీజేపీ అని, ఈ దేశ ఆకాంక్షలను నెరవేర్చందుకు పీఎం మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు కులగన్న చేయలేకపోయిందో చెప్పాలన్నారు. ఏదో మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మేస్తే నమ్మేలా లేరని సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు, తదితరులు ఉన్నారు.