22-10-2025 01:55:36 AM
పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ సూచించింది. నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతాయని, శుక్ర, శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, వర్షాలు కురుస్తాయని పేర్కొంది.