14-10-2025 06:58:44 PM
ఏఐసీసీ అబ్జర్వర్ మన్నె శ్రీనివాస్..
చొప్పదండి (విజయక్రాంతి): కార్యకర్తల అభిప్రాయం మేరకే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని నియామకం జరుగుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ మన్నె శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గంగాధర మండలం మధురానగర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో చొప్పదండి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడి నియామకం గురించి కార్యకర్తల నుండి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తల నుండి సేకరించిన అభిప్రాయాలను అధిష్టానానికే పంపిస్తామని, కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అబ్జర్వర్లు ఆత్రం సుగుణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నా రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల బిసి సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, కూస రవీందర్, చొప్పదండి, రామడుగు , గంగాధర, బోయినపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, జవ్వాజి హరీష్, పురుమల్ల మనోహర్, వన్నేల రమణారెడ్డి, ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.