calender_icon.png 29 November, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష రూ.లక్ష చొప్పున జరిమానా

29-11-2025 01:08:24 AM

సంగారెడ్డి, నవంబర్ 28(విజయక్రాంతి):అక్రమంగా గంజాయిని తరలించిన నలుగురికి పదేళ్ళ పాటు జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానాను సంగారెడ్డి ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్ కోర్టు న్యాయమూర్తి జయంతి శుక్రవారం తీర్పునిచ్చినట్లు మెదక్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ తెలిపారు. 2021 ఫిబ్రవరిలో 102 కేజీల గంజాయిని అక్రమంగా రవాణ చేస్తుండగా జహీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

సంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఎస్త్స్ర హెచ్‌ఏ.మోహన్ కుమార్, రమేష్ రెడ్డి అక్రమ గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసును జహీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో ఎస్త్స్ర కేసు నమోదు చేశారని డీసీ తెలిపారు. ఈ కేసులో సంగారెడ్డి జిల్లా కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి జయంతి నిందితులైన రాథోడ్ మోహన్, రాథోడ్ వెంకట్, కేతావత్ పాండు నాయక్, రాథోడ్ మోతిరాంలకు పది సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. గంజాయి నిందితులకు శిక్షలు పడేవిధంగా చర్యలు చేపట్టిన ఎక్సైజ్ సిబ్బందిని డిప్యూటి కమిషనర్ హరికిషన్ అభినందించారు.