calender_icon.png 22 October, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు ఆర్డర్ ను డిసిఓ లెక్కచేయడం లేదు

21-10-2025 10:21:43 PM

డిసిఓపై చైర్మన్ ఆగ్రహం

తాడ్వాయి (విజయక్రాంతి): హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను కూడా డిసిఓ లెక్కచేయడం లేదని తాడువాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి డిసిఓ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

కోర్టు ఆర్డర్ కాపీని డిసిఓకు ఇచ్చి నెల రోజులు అవుతుందని అయినా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తాడ్వాయి సొసైటీకి ఆర్డర్ ఇవ్వాలని లేని ఏడల తమకు ఎందుకు ఆర్డర్ ఇవ్వడం లేదో లేక ద్వారా తెలపాలని కపిల్ రెడ్డి కోరారు. తాడువాయి మండలంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. మండలంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే యూరియా కొరతను నివారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నర్సింలు, నాయకులు రాజిరెడ్డి, మంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.