calender_icon.png 22 October, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువును తలపిస్తున్న రహదారి

21-10-2025 10:17:54 PM

చెరువు అనుకునేరు... జిల్లాకు వెళ్లే రహదారి

రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు

గరిడేపల్లి (విజయక్రాంతి): ఏంటి ఇది చెరువు అలుగు పారుతుంది అనుకుంటున్నారా... కాదు కాదు అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే... ఇది సూర్యాపేట గరిడేపల్లి మిర్యాలగూడ ప్రధాన రహదారి... గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామం వద్ద సూర్యాపేట గరిడేపల్లి మిర్యాలగూడ ప్రధాన రహదారి మీద చిన్నపాటి వర్షానికే తరచూ ఇలా చెరువు అలుగు పారినట్లుగా మొత్తం నీళ్లతో నిండిపోతుంది. దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ గుంట ఉందో ఎక్కడ పడతామో ఏం జరుగుతుందో తెలియక భయం భయంగా రోడ్డు దాటుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా మారిందని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా రోడ్డు మీద నీళ్లు నిలిచి రోడ్డు దెబ్బ తినే లోపే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.