04-10-2025 12:13:07 AM
జనగామ, అక్టోబర్ 3 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని స్థానిక గుండ్ల గడ్డ కాలనీలోని, ఉమామహేశ్వర దేవాలయంలో, దుర్గ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా డిసిపి రాజమహేంద్ర నాయక్ శమీ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ తరఫున దేవాలయ అర్చకులు గంగు సామామూర్తి శర్మ పట్టు వస్త్రాలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. ఉమామహేశ్వర దేవాలయం నా సొంత గుడిగా భావిస్తున్నాను అని, అందరికీ జమ్మి పత్రి ఇచ్చి, ఆదరణ, ఆప్యాయతతో దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.