04-10-2025 12:14:08 AM
జనగామ, అక్టోబర్ 3 (విజయక్రాంతి): పట్టణంలోని గుండ్లగడ్డ కిష్టభావి 28 వవార్డ్ లో గల లక్ష్మీగణపతి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా గత 11 సంవత్సరాలుగా దుర్గా మాత అమ్మవారిని నెలకొల్పి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మరియు ప్రతిరోజు ధూప, దీప నైవేద్యాలతో అన్నప్రసాద కార్యక్రమాలు చేపట్టారు.
విజయదశమి సందర్భంగా దుర్గామాత రాజరాజేశ్వరి దేవి అవతారంలో కొలువై ఉన్నందున శ్రీకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో నవరాత్రుల పూజలు ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే తల్లి దుర్గమ్మ తల్లి అని భక్తుల అపార నమ్మకం. అందువల్ల ఇక్కడ ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. కోరిన కోరికలు తీరిన వారు మరో సంవత్సరం వచ్చి వారి మొక్కలు చెల్లించుకొని అన్న,ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. ఈసందర్భంగా విజయదశమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజల్లో వార్డ్ ప్రముఖులు,ప్రజలు, యువతి,యువకులు ఆసక్తిగా పాల్గొన్నారు.