04-10-2025 12:12:25 AM
ఆయుధ పూజ చేసిన జిల్లా ఎస్పీ
ఆదిలాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : దసరా పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. దసరా పండుగ సం దర్భంగా ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ గురువారం నిర్వహించిన ఆయుధ పూజ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పం డితుల మంత్రోచ్చారణ మధ్య ఆయుధ భాండాగారంలోని ఆయుధాలకు, పోలీస్ వాహనాలకు ఎస్పీ ఆయుధ పూజ లు నిర్వహించారు.
విజయానికి చిహ్నంగా ఆకాశం వైపు తుపాకితో ఐదు రౌండ్‌లు కాల్చి విజయదశమిని వేడుకలను ప్రారంభించారు. జిల్లా ప్రజలందరికీ విజయదశమి సందర్భంగా విజయం చేకూరాలని ఆకర్షించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఇంద్ర వర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకట్, మురళీ, చంద్ర శేఖర్, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.