calender_icon.png 10 September, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి

10-09-2025 08:10:24 PM

నిర్మల్ (విజయక్రాంతి): కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం చాకలి(చిట్యాల) ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్(Additional Collector Kishore Kumar) ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ జీవితమే ఒక పోరాటగాథ అని అన్నారు. భూస్వాముల దమనకాండకు వ్యతిరేకంగా, పేదల హక్కుల కోసం ఆమె చేసిన త్యాగం, ధైర్యం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం ప్రతి ఒక్కరూ ఐలమ్మ అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు శ్రీనివాస్, మోహన్ సింగ్, వివిధ కుల సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొని ఐలమ్మకు నివాళులర్పించారు.