18-10-2025 12:25:09 AM
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 56వ డివిజన్ లో పారిశుధ్య కార్మీకురాలిగా పని చేస్తున్న బడుగు రేణుక శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. విద్యానగర్ రోడ్డులోని శివథియేటర్ పెంట్రోల్ బంక్ సమీపంలో రేణుకను ద్విచక్రవాహానం డీ కొట్టింది. దీంతో అక్కడే పడిపోవడంతో స్థానికులు, తోటి పారిశుధ్య కార్మీకులు హాస్పిటల్ కు తరలించగా మార్గమద్యలోనే మృతి చెందింది. ప్రమాద విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ మృతదేహం వద్దకు చేరుకొని... ప్రమాద ఘటన వివరాలను పారిశుధ్య అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం భౌతికకాయానికి పూల మాల వేసి శ్రద్ధాజలి ఘఘటించారు. పారిశుధ్య కార్మీకురాలి కుటుంబ సభ్యులను పరామర్షించి... సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి తక్షణ సహాయం కింద 20.000 రూపాయల నగదును అందించారు. ఈ సంధర్బంగా కమీషనర్ మాట్లాడుతూ.... పారిశుధ్య కార్మీకురాలు రెణుక రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.