calender_icon.png 18 October, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి లేఖ రాశాం

18-10-2025 12:25:30 AM

హైకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం

పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిం చేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎ న్నికల సంఘాన్ని గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కో ర్టుకు తెలిపారు.

అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది విద్యాసాగర్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల వి డుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర ఎన్ని కల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం రిజర్వేషన్లను మరోసారి ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఈ మే రకు ప్రభుత్వానికి లేఖ కూడా రాశామన్నా రు. దీనిపై సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని వివరించారు. ప్ర భుత్వం నిర్ణయం చెప్పడానికి 3 వారాల స మయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే కౌంటర్ దా ఖలుకు ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు రెండు వారాల గడువు ఇచ్చిం ది. తదుపరి విచారణను వాయిదా వేసింది.