08-08-2025 12:00:00 AM
కొనసాగుతున్న సహాయక చర్యలు
డెహ్రాడూన్, ఆగస్టు 7: దైవభూమి ఉత్తరాఖండ్‌ను మెరుపువరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఖీర్ గంగ నదికి వచ్చిన వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. మరీ ముఖ్యంగా ఉత్తర కాశీ జిల్లాలోని ధరాలీ గ్రామం జలప్రళయం ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
సహాయక బృందాలు కనీసం 190 మందిని రక్షించాయి. వరదలతో అతలాకుతలం అయిన ధరాలీ గ్రామం సముద్రమట్టానికి 8,600 అడుగుల ఎత్తులో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. సైంజీ గ్రామంలో వరదల వల్ల ఇండ్లు కోల్పోయిన ఇంటిఓనర్లకు రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి రూ. 1,30,000 ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.