08-08-2025 12:00:00 AM
ప్రకటించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
మాస్కో, ఆగస్టు 7: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వర లో భారత్‌లో పర్యటిస్తారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం తెలిపారు. ప్రస్తుతం రష్యాలో ఉన్న దోవల్ రష్యా భద్రతామండలి సెక్రటరీ సెర్గీ షొయిగుతో సమావేశం తర్వాత దోవల్ ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది చివర్లో పుతిన్ పర్యటన ఉండే అవకాశం ఉంది.
ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత పుతిన్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. గతేడాది జూలైలో భారత ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా రష్యా అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ను బహూకరించింది.