calender_icon.png 28 October, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ కోదండ రామాలయంలో ఉత్సవమూర్తుల ఊరేగింపు చేస్తున్న దృశ్యం

28-10-2025 07:25:22 PM

అరటి పళ్ళతో ఆంజనేయ స్వామిని అలంకరించిన దృశ్యం 

శ్రీ కోదండ రామాలయంలో దేవతామూర్తుల అలంకరణ

శ్రీ రామ యజ్ఞంలో పూర్ణాహుతి చేస్తున్న దృశ్యం 

వేదమంత్రాలతో శ్రీరామ యజ్ఞ మహోత్సవం

నేరేడుచర్ల అక్టోబర్ 28 ప్రభాతవార్త 

నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్లలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శ్రీరామ యజ్ఞం మూడవరోజు మంగళవారం వేదమంత్రాలతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పూజారి బృందావనం శ్రీరామ నరసింహ తేజ ఆధ్వర్యంలో ఆలయ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి, శ్రీ రామదండానికి పంచామృతాలతో అభిషేకం చేసి కదిలీఫలాలతొ అలంకరణ చేశారు. అనంతరం ఆలయంలోని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకిపై గొడుగు నీడన ఆలయం చుట్టూ జైశ్రీరామ్ నినాదాలతో ప్రదక్షిణలు చేశారు.

ఆలయ ఆవరణలోని మంటపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో వేదమంత్రాలతో సాంప్రదాయ సిద్ధంగా భక్తిశ్రద్ధలతో శ్రీరామ యజ్ఞాన్ని నిర్వహించారు, ఆలయంలోని దేవతామూర్తులను తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి పోలి ఉండే విధంగా అలంకరించడంతో భక్తులు తన్మయంతో దర్శించుకున్నారు, అరటి పండ్లతో అలంకరించిన ఆంజనేయస్వామిని భక్తులు జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ దర్శించుకున్నారు, ఆలయంలోని దేవతామూర్తుల విశేష అలంకరణలతో, శ్రీరామ యజ్ఞం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయం మొత్తం ఆధ్యాత్మికతసంతరించుకుంది.