28-10-2025 07:28:22 PM
కోదాడ: కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ విద్యార్థినులకు, గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన 16వ ఇంటర్ స్టేట్ ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ నందు తమ ప్రతిభ చూపించి వివిధ కేటగిరీలల్లో బంగారు పతకాలు సాధించారు. విద్యార్థులను కిట్స్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ చరవాణి ద్వారా విద్యార్థులను అభినందించారు. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న హర్షిత, బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న అంజలి, బంగారు పతకాలు సాధించగా, రవళి, విజయ, శిరీష వెండి పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, హ్యుమానిటీస్ విభాగాదిపతి రమేష్, కరాటే కోచ్ మాదవి లత, అధ్యాపకులు పాల్గొన్నారు.