calender_icon.png 11 September, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు రక్ష డెడికేటెడ్ కమిషన్

04-09-2025 12:00:00 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

స్థానిక  సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటం, బీసీ రిజర్వేషన్లపై కేంద్రం తేల్చకుండా కొంగ జపం చేస్తూ నెపం కాంగ్రెస్‌పై నెట్టే ప్రయత్నం నిరంతరంగా కొనసాగుతుంది. ఎలా ముందుకు వెళ్లాలన్నా విషయంలో తర్జన, భర్జన పడి, సాధ్యా సాధ్యాలను పరిశీలించి రిజర్వేషన్ల కోసం న్యాయ నిపుణుల తలుపు తట్టింది.

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నాలుగు నెలలుగా కుస్తీపడుతున్న రిజర్వేషన్లకు బీజేపీ అసంబద్ధ వైఖరి బీసీల పాలిట శాపంగా మారింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పకుండా 42 శాతం రిజర్వేషన్ల అమలుకు వివిధ రకాల ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. అందులో మొదటగా విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపితే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించింది.

బీసీ బిడ్డను అని చెప్పుకొనే ప్రధాని మోదీ లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టినప్పటికీ ఎలాంటి చర్చకు తా వు ఇవ్వకుండా అడ్డుకున్నది నిజం కాదా? ఇక రెండవ దఫాలో పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ ‘285 (ఎ)’ను సవరించి, స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకోచ్చింది. ఈ సాహసోపేత నిర్ణయంతో ఖంగుతిన్న ప్రత్యర్థులు తెరవెనుక రాజ్ భవన్ వేదికగా రాజకీయాలకు తెరలేపారు.

ఎందుకంటే న్యాయపరమైన చిక్కులు చూపుతూ, కోర్టు తీర్పులను చూపెట్టి నీరుకార్చే ప్రయత్నం వెనక ఉన్న కుట్రలను బట్టి వారికి చిత్తశుద్ధి లేదని అర్ధం అయ్యింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్సాహం చూపిందో ఇక్కడ అర్థమవుతుంది. కులగణన ఆధారంగా జనాభా దామాషా ప్రకారం మేమెంతో.. మాకంతా ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి.

అయితే ఈ క్లిష్ట పరిస్థితులను ముందుగానే ఉహించి రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానాలు తప్పు పట్టకుండా ‘డెడికేటెడ్ కమిషన్’ ఏర్పాటు చేసి ఓబీసీలకు అండగా నిలిచింది. కులగణనలో బీసీల రాజకీయ వెనుకబాటుతనంపై ఎంపిరికల్‌గా సమాచారాన్ని రాబట్టగలిగింది. దీని ఆధారంగా 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ చివరి అస్త్రంగా మంత్రిమండలిలో తీర్మానం చేసింది. న్యాయబద్ధ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ పరిధిలో పోరాటానికికి సిద్ధం అయ్యింది.  

ధర్నాలు, ఆందోళనలు చేసినా

స్థానిక  సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పెట్టిన డెడ్‌లైన్ దగ్గర పడుతుండటం, బీసీ రిజర్వేషన్లపై కేంద్రం తేల్చకుం డా కొంగ జపం చేస్తూ నెపం కాంగ్రెస్‌పై నెట్టే ప్రయత్నం నిరంతరంగా కొనసాగుతుంది. ఎలా ముందుకు వెళ్లాలన్నా విష యంలో తర్జన, భర్జన పడి, సాధ్యా సాధ్యాలను పరిశీలించి రిజర్వేషన్ల అమలు కోసం న్యాయ నిపుణుల తలుపు తట్టింది. ఇదే పాత కాంగ్రెస్ అయితే ఇంత ఇబ్బంది పడేది కాదు.. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.

రాహుల్ సైతం హామీ నెరవేర్చే బా ధ్యత రేవంత్ భుజాన పెట్టాడు. అందుకే పార్లమెంట్‌లో తొమ్మి దో షెడ్యూల్‌లో పెట్టి చట్టం చేయాలని ఢిల్లీ కేంద్రంగా ధర్నాకు దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరి అస్త్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రత్యేక జీవో జారీ చేసి తక్షణమే ఎలక్షన్ నోటిఫికేషన్‌కు వెళ్లాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తున్నది. ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లయితే న్యాయస్థానాలు జోక్యం చేసుకోకుం డా కేవియట్ వేసి, సజావుగా పోరాడవచ్చనే వాదన కూడా తెరపైకి తీసుకొచ్చారు.

న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాలు ఓబీసీలకు కలిసి వచ్చే అంశంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే 2018, 2020లో మహారాష్ర్టలో జరిగిన ఎన్నికలను సవాల్ చేస్తూ 2021లో సుప్రీంకోర్టు ‘వీకే రావు కేసు’ కారణంగా కేసు కొట్టివేయడమే కాకుండా ‘డెడికేటెడ్ కమిషన్’ రిపోర్ట్ లేదనే సాకు బలంగా వినిపించింది. బీసీలకు రిజర్వేషన్ రద్దు చేస్తూ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. 

ఏమిటీ డెడికేటెడ్ కమిషన్?

ప్రభుత్వానికి ఉన్న బలం అంత కూడా 2024లో నిర్వహించిన కులగణన లెక్కలు ‘డెడికేటెడ్ కమిషన్’ ఇచ్చిన రిపోర్టు శ్రీరా మ రక్షగా నిలుస్తుందనే అభిప్రాయం నెలకొంది.  కాగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వే షన్లకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది.  కమిషన్ చీఫ్ బూసాని వెంకటేశ్వర్లు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కలిసి రిపోర్ట్‌ను అందజేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఆరు సెగ్మెంట్ల రూపం లో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డెడికేటెడ్ కమిషన్ దాదాపు మూ డు నెలలు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసర త్తు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వే ష న్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన, దానికి అనుగుణంగా ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం గతేడాది నవంబర్ 4వ తేదీన డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

బీసీలకు సంజీవిని 

2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేసీఆర్ 34 నుంచి 23 శా తానికి రిజర్వేషన్లు తగ్గించారు. అయినా సామాజిక చైతన్యంతో జనరల్ స్థానాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో 33 శాతం పైగా స్థానాలు కైవసం చేసుకున్నారు. అదే జిల్లా పరిషత్ చైర్మన్‌లలో 32 మందిలో సరిగ్గా 23 శాతం అంటే కేవలం ఏడుగురు బీసీ వర్గానికి చెందిన వారు. అటువంటిది పార్టీ నయవంచన చేసేందుకు అన్ని పార్టీలు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి భారీ మోసానికి తెర లేపాయి.

పార్టీపరంగా చేస్తే రెండు శాతం, లేకుంటే ఇంకొంత శాతం మాత్రం బీసీలకు అదనంగా అవకాశాలు దక్కుతాయి. కానీ పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. వీటికి తోడు బీసీలు గెలుచుకునే జనరల్ స్థానా లు ఉండనే ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వం 50 శాతం పరిమితి ఎత్తివేసి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ముందడుగు వేయ డం ముదావహం. తాజాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభు త్వం ఫైల్‌ను గవర్నర్‌కు పంపించిం ది.

అయితే గవర్నర్ సంతకం ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ రేవంత్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.  కాగా కాంగ్రెస్ నిర్ణయంతో ‘ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టు’ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాదిరిగా కులగణన లో పాల్గొనని బీఆర్‌ఎస్, ఆర్డినెన్స్‌కు అడ్డుపుల్ల వేసిన బీజేపీకి పాలు పోయే పరిస్థితి లేదు.వారి భరోసా అంతాగతంలో బీహార్ నితీష్ కుమార్ ప్రభుత్వం 50 శాతం సీలింగ్ దాటిందనే ఉద్దేశంతో హైకో ర్టు ఆ జీవోను కొట్టివేసిందనే విపక్షాల వాదన.

రిజర్వేషన్ల పెంపుకోసం 340 ఆర్టికల్ కింద ప్రత్యేక ‘డెడికేటెడ్ కమిషన్’లను నియమించి,ఆ దిశగా ఆ కమిషన్‌లు సూ చించే సిఫార్సుల మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టంగా డాక్టర్ కె.కృష్ణమూర్తి, వికాస్ కిషన్‌రావు గవాలి, సురేష్ మహాజన్, రాహుల్ రమేష్‌వాగ్, మన్‌మోహన్ నగర్, వైద్యపాండ్యా మున్న గు కీలకమైన తీర్పులలో రాజ్యాంగ ధర్మాసనాలు స్పష్టంగా సూచించాయి.

హైకోర్టు సెప్టెంబర్ 30, డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 42 శాతాన్ని అమలుకు న్యా యపరమైన చిక్కులు రాకుండా ‘డెడికేటెడ్ కమిషన్’ ఓబీసీలకు సంజీవనిగా మారిం ది. విపక్షాలు బీసీలపై ప్రేమ ఒలకబోయ డం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయ డం కాదు. శాసనసభ సాక్షిగా మీ అసలు రంగు బయటపడే రోజులొచ్చాయనేది నిర్వివాదాంశం.

వ్యాసకర్త సెల్: -9866255355