calender_icon.png 11 September, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన్యప్రాణులను సంరక్షిద్దాం

04-09-2025 12:00:00 AM

లక్ష్మణ్ కుమార్ :

నేడు జాతీయ వన్యప్రాణి దినోత్సవం

* భారతదేశం 600కు పైగా వన్యప్రాణుల అభయారణ్యాలు, 106 జాతీయ ఉద్యానవనాలతో అద్భుతమైన వన్యప్రాణులకు నిలయం. ఈ రక్షిత ప్రాంతాలు బెంగాల్ పులి, భారతీయ ఖడ్గమృగం, మంచు చిరుత జాతుల ను సంరక్షించడానికి మాత్రమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కీలకం. జిమ్ కార్బెట్, కాజిరంగ, రణథంబోర్ వంటి జాతీయ ఉద్యానవనాలను కాపాడటంలో ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. 

వన్య ప్రాణులను కాపాడుకోవ డం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం గా ప్రతిదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. అంతర్జాతీయ సమాజం ముందు అతిపెద్ద సవాల్‌గా మారింది.ఈ పరిస్థితుల్లో వన్య ప్రాణులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని తో పాటు పర్యావరణా న్ని కూడ  తప్పక కాపాడుకోవాలి. ఇది ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. అందరూ చేయి చేయి కలిపి సమష్టిగా ముందుకు సాగితేనే ఫలితాలను అందుకోగలం.

ఈ సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితితో సహా అనేక దేశాలు తమ వంతు ప్రయత్నిస్తున్నాయి. ఏటా ఈ దిశగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా యి. కేవలం ఆయా దేశాల ప్రభుత్వాలే కా కుండా అనేక స్వచ్ఛంద సంస్థలు, ఎంతోమంది పర్యావరణ ఉద్యమకారులు ఇం దులో భాగస్వాములు అవుతున్నారు.

ఇందులో భాగంగా సెప్టెంబర్  4వ  తేదీన జాతీయ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటున్నాం. ‘అంతరించిపోతున్న జంతు వులను రక్షించడం, స్థిరమైన జీవనాన్ని ప్రోత్సహించడం గురించి అవగాహన పెంచడంపై దృష్టి సారించాలి’ అనే థీమ్ ఎంచుకున్నారు. మన పరిసరాల్లో ఉన్న జీవ జాతులు, వన్య ప్రాణులు.. వాటి సంరక్షణపై అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

స్వార్థ ప్రయోజనాల కోసం

ఈ భూమిని మనుషులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. ఆహారం, జీవనాన్ని ఇచ్చే భూమిని నాశనం చేస్తున్నాడు. జల, వా యు, గాలి కాలుష్యం, పారిశ్రామిక గృహ వ్యర్థాలు, చెత్తాచెదారం వల్ల భూసారం దెబ్బతింటోంది. మన దేశంలోనే ప్రతి రోజూ 15 వేల టన్నుల కంటే ఎక్కువగా చెత్త ఉత్పత్తి అవుతోంది.

వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు కొన్ని వందల సంవత్సరాల వరకు భూమిలో నాశనం కాకుండా నిల్వ ఉండి భూమి ఉత్పాదక శక్తిని తగ్గిస్తున్నాయి. పశు పక్ష్యాదులు వీటిని తినడం వల్ల చనిపోతున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యం తీవ్ర ప్రమాదానికి సంకేతం. అడవులు మాత్రమే 60వేల వృక్ష జాతులకు, 80 శాతం ఉభయచర జాతులకు, 75 శాతం పక్షి జాతులకు  నిలయం గా ఉన్నాయి.

అ దే సమయంలో 1.6 బిలియన్లకు పైగా ప్రజలకు ఆహారం, ఔషధం, ఆదాయం రూపంలో సహజ మూలధనంతో మద్ద తు ఇస్తున్నాయి.ఒక మిలియన్ కంటే ఎక్కువ  జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని అంచనా వేయబడింది.  తీవ్రతరం అవుతున్న ట్రిపుల్ ప్లానెటరీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, వన్యప్రాణుల సంరక్షణకు వినూత్నమైన ఆర్థిక సహాయం అత్యవసరం. 

వన్యప్రాణుల సంరక్షణ చట్టం

ప్రపంచ జీడీపీలో సగానికి పైగా ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. జీవవైవిధ్య న ష్టం ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా మారుతుంది. పెట్ లైఫ్ స్టుల్  నిపుణురాలు, రచయిత్రి కొలీన్ పైజ్ 2005లో జాతీయ వన్యప్రాణుల దినోత్సవాన్ని స్థాపించారు. వన్యప్రాణుల సంరక్షణకారుడు స్టీవ్ ఇర్వి న్ గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని కొలీన్ నిర్ణయించారు. భారతదేశం 600కు పైగా వన్యప్రాణుల అభయారణ్యాలు, 106 జాతీయ ఉద్యానవనాలతో అద్భుతమైన వన్యప్రాణులకు నిలయం.

ఈ రక్షిత ప్రాంతాలు బెంగాల్ పులి, భారతీయ ఖడ్గమృగం, మంచు చిరుత జాతుల ను సంరక్షించడానికి మాత్రమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కీలకం. జిమ్ కార్బెట్, కాజిరంగ, రణథంబోర్ వంటి జాతీయ ఉద్యానవనాలను కాపాడటంలో ప్రభుత్వాలు కృషి చే స్తున్నాయి. భారత ప్రభుత్వం 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం వంటి వన్యప్రా ణుల సంరక్షణ చట్టాలను రూపొందించింది.

ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లాంటి కార్యక్రమాలు ఐకానిక్ జాతుల జ నాభాను స్థిరీకరించడంలో ఆశాజనకమైన ఫలితాలను సాధించాయి. దేశంలో జనా భా విస్ఫోటం వల్ల వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరీకరణ, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, జలవిద్యుత్ ప్రాజె క్టుల నిర్మాణం, రోడ్లు, రైలు మార్గాల అభివృద్ధి మొదలైన కార్యకలాపాలవల్ల అడవు ల విస్తీర్ణం క్రమంగా తగ్గు తోంది. దీంతో పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలుగుతోంది.

అడవులు తగ్గిపోవడంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతోంది. అందుకే స్థిరమైన అభివృద్ధిని (సస్టే యినబుల్ డెవలప్‌మెంట్)ను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 1980లో స మగ్ర అడవుల పరిరక్షణ చట్టా న్ని రూపొందించింది. పదో పంచవర్ష ప్రణాళికల్లో స మగ్ర అడవుల పరిరక్షణ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 1988లో అటవీ విధానా న్ని, 2006లో జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది.

అవగాహన అవసరం..

వన్య ప్రాణులు ఆహార గొలుసులో ఒక భాగం. పర్యావరణ వ్యవస్థలో సమతుల్యతను కాపాడుకోవడానికి అవి బాధ్యత వహిస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి, వన్యప్రాణులు వాటి ని రక్షించాలి. అడవుల పరిరక్షణ, నిర్వహణ అంశం భారత రాజ్యాంగం ప్రకారం ఉ మ్మడి జాబితాలో ఉండటంతో అడవుల ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్ర త్యేక కార్యక్రమాలను  దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల గురించి, వాటి సంరక్షణ గురించి నేటి  యువతరానికి అవగాహన అవసరం.

అందరం కలిసికట్టుగా సమాజ హితం కోసం వన్యప్రాణుల సంరక్షణకు న డుం బిగిద్దాం. వన్యప్రాణు ల సంరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన చ ట్టాలపై పూర్తిగా అవగాహన కల్పించుకు ందాం. సమాజంలో భాగమైన వన్యప్రాణులను సంరక్షణకు ప్రతి ఒక్కరు ఉద్య మంలో చర్యలు తీసుకోవాలి. అప్పుడే వా టి రక్షణకు చర్యలు లభిస్తాయి. యువతరానికి మరింత అవగాహన కల్పించడం భ విష్యత్తు పరిరక్షణకు ప్రథమ కర్తవ్యం.