20-10-2025 12:00:00 AM
కొమురవెల్లి, అక్టోబర్ 19: కార్తీక మాసం పురస్కరించుకొని కొమరవెల్లి మల్లన్న ఆలయంలో సామూహిక దీపోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి టంకశాల వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఆలయ ఆవరణంలో సామూహిక దీపోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
కార్తీక పౌర్ణమి, కార్తీక అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, పూజల తో పాటుసాంస్కృతిక, భజన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సామూహిక దీపోత్సవంలో పాల్గొనే మహిళలకు మట్టి ప్రమిదలు, ఒత్తులు, దీపం నూనె, బ్లౌజ్ పీసులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటలకు సామూహిక దీపోత్సవాలు నిర్వహిస్తామన్నారు. దర్శనానికి వచ్చే మహిళలతో పాటు స్థానిక మహిళలు కూడా పాల్గొనవచ్చు అని ఆయన పేర్కొన్నారు.
మల్లన్న దర్శించుకున్న ఏసీపీ
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ని కరీంనగర్ ఏసిపిసతీష్ కుమార్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాహ దేవుని మల్లికార్జున్ ఆశీర్వాచనములు ఇచ్చి, స్వామివారి శేష వస్త్రంతోపాటు ప్రసాదాలను అందజేశారు.