calender_icon.png 25 October, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోర్లకు మరమ్మతులు

20-10-2025 12:00:00 AM

మునిపల్లి, అక్టోబర్ 19 : అధికారులు ఎట్టకేలకు స్పందించి చెడిపోయిన బోర్లకు మరమ్మతులు చేపట్టారు. ఈనెల 15న విజయక్రాంతి దినపత్రికలో ఖమ్మంపల్లిలో నీటి గోస అనే కథకానికి అధికారులు స్పందించి పాడైన బోర్లకు మరమ్మతులు చేపట్టి గ్రామ ప్రజలకు తాగునీటిని అందించారు. దీంతో గ్రామస్తులు విజయక్రాంతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మండల స్థాయి, పంచాయతీ అధికారుల తీరు పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఇలాంటి అధికారులు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటి బోర్లకు మరమ్మతులు చేపట్టి తాగేందుకు నీటిని అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.