calender_icon.png 24 October, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధులకు హాజరుకాకుండానే...

20-10-2025 12:00:00 AM

  1. వేతనాలు పొందుతున్న వైద్యాధికారులు, సిబ్బంది 

అహ్మదీపూర్ పీహెచ్‌సీలో వైద్య ఉద్యోగుల నిర్వాకం 

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెల్లడి చర్యలు తీసుకోవాలని  డీఎంహెచ్‌ఓకు ఆదేశాలు

గజ్వేల్, అక్టోబర్ 19: రిజిస్టర్లో సంతకాలు పెట్టి విధులకు వైద్యాధికారులు వైద్య సిబ్బంది డుమ్మా కొడుతున్నారు. గజ్వేల్ మండలం అహ్మదీపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ లో వైద్యాధికారి ప్రణయ్ రాజ్, ఇతర సిబ్బంది సంతకాలు ఉన్నా ఆయా రోజుల్లో విధులకు గైర్హాజరు అయ్యారు.

ఈ విషయాన్ని పరిశీలించిన కలెక్టర్ హైమావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది గైర్హాజరు అయినను సంతకాలు చేసి జీతాలు తీసుకుంటున్నారని,  సంతకాలు చేసిన వారిపైన, సాలరీ బిల్ చేసిన వారిపైన ఇద్దరిపై యాక్షన్ తీసుకోవలసిందిగా డిఎంఎచ్‌ఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఆసుపత్రిలో విధులు సక్రమంగా నిర్వహించకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.