calender_icon.png 24 October, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిరేకల్ లయన్స్ క్లబ్స్ సేవలు అభినందనీయం

24-10-2025 05:12:44 PM

మున్సిపల్ చైర్మన్  చౌగోని రజిత శ్రీనివాస్

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమాలు , అల్పాహారం అన్నదానం  నిర్వహించడం అభినందనీయమని నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రంజిత్ కుమార్ అన్నారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్  కార్యక్రమంలో భాగంగా  నకిరేకల్  లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో  నకిరేకల్ మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నేత పన్నాల రాఘవరెడ్డి రంగమ్మ దాతృత్వంతో మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నకిరేకల్ లయన్స్ క్లబ్ లు ప్రతిరోజు  పేదలకు అన్నదానం చేయడం గొప్ప విషయమని  ప్రశంసించారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు  చేస్తున్న సేవలు గుర్తించి అన్నదాన కార్యక్రమాలు వారికోసం ఏర్పాటు చేయడం    గర్వించదగ్గ విషయం అన్నారు.

ఈ కార్యక్రమం నకిరేకల్ లయన్స్ క్లబ్  అధ్యక్షుడు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాల పాపిరెడ్డి  వృద్ధాశ్రమం ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్రావు  లయన్స్ క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు  కోశాధికారి అండెం వెంకన్న ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ వుప్పల సంతోష్ కుమార్ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు కందాల నారాయణరెడ్డి  గుండ్లపల్లి నారాయణ  నకిరేకల్ మున్సిపాలిటీ సిబ్బంది  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాతగా  సహకరించిన పన్నాల రాఘవరెడ్డి రంగమ్మ దంపతులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు.