calender_icon.png 15 September, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు ఉంటాయా.. ఉండవా?

15-09-2025 12:00:00 AM

-గడువు సమీపిస్తున్న.. కొలికిరాని వ్యవహారం

-ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితా సిద్ధం

-పార్టీ నేతలకు చుట్టూ మద్దతు కోసం ఆశావాహుల క్యూ

నిర్మల్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకో ర్టు ఆదేశించిన ఆ దిశగా ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలలో ఉంటాయా ఉండవా అనే చర్చ గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై ఇంకా చట్టపరమైన చిక్కులు తిరగకపోవడంతో ఎన్నికల నిర్వహణపై సంసిద్ధత నెలకొంది.

ఇంకా 20 రోజులు మాత్రమే హైకోర్టు గడువు ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు ప్రభుత్వం మరింత గడువు కోరే అవకాశం ఉండడంతో స్థానిక సంస్థల్లో పోటీ సిద్ధమౌతున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కావలసిన ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రభుత్వం ఇప్పటికి నోటిఫికేషన్ జారీ చేయగా ఈనెల 10న అధికారికంగా ప్రకటించనున్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటికీ గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను ఇప్పటికే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విడుదల చేశారు.

ఈనెల 6న అన్ని మండల ప్రజాప్రతి కార్యాలయంలో ఓటర్ల జాబితాను విడుదల చేసిన ప్రభుత్వం ఈనెల 10 వరకు తుది ఓటర్ల జాబితా పై ప్రకటన జారీ చేయనుంది. ఈనెల 8 వరకు అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేర్పుల అనంత రం ఓటర్ జాబితా పేర్లు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తుది ప్రకటన విడుదల చేయనున్నారు ఎన్నికల ప్రక్రియకు కావల సిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం యం త్రాంగం చేపట్టినప్పటికీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు ఆధారపడి ఉండడంతో ఎన్నికలు ఈ నెలలో ఉంటాయా ఉంటాయా అనే అనుమానం కలుగుతుంది

జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు

ప్రభుత్వం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పశిష్టమైన చర్యలను ఇప్పటికే పూర్తి చేసింది. జిల్లాలో మొత్తం 18 మండలా లు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. 400 గ్రామపంచాయతీ ఉండగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. 18 జెడ్పిటిసి 157 ఎంపీటీసీ స్థానాలకు నిర్మల్ బైంసాం ఖానాపూర్ మున్సిపాలిటీలోని 96 వార్డు సభ్యులకు ఎన్నికలను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నా రు. జిల్లాలో 4 49 302 ఓటర్లు ఉండగా 2,13,805 పురుషులు, 2,35,485 మహిళా ఓటర్లు 12 మంది ఇతర ఓటర్లు ఉన్నట్టు గుర్తించారు.

ప్రతి 650 ఓటర్ల గాను ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలకు రావలసిన సామాగ్రి సిబ్బందిని సిద్ధం చేసి ప్రభుత్వం ఆదేశించడం ఎన్ని కలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకపోవడం వల్ల జనరల్ గుర్తులతో బ్యాలెట్ పేపర్ ముద్రించినట్లు అధికారులు తెలిపారు. ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు మాత్రం బ్యాలె ట్ పేపర్ ముద్రణ చేపట్టవలసి ఉంటుంది. ఎన్నికల్లో విధులు నిర్వహించి అధికారులకు ఇప్పటికీ రెండు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఎన్నికలపై అంతా సిద్ధంతో ఉన్నారు. హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వం పాటించవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ నెల లో ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించినప్పటికీ ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వంపై వ్యతిరేకత ? 

నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్యే ఎన్నికలు 18 నెలలు గడుస్తున్న సెట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజ ల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ప్రకటించి అందులో కొన్ని పథకాలను అమలు చేసినప్పటికీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ పెన్షన్ల పెంపుపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నది. ఎమ్మెల్యేలుగా గెలిచినవారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం నిధుల కొరత కారణంగా అభివృద్ధి జరగకపోవడంతో సెట్టింగ్ ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేక త ఉంది, నిర్మల్ నుంచి గెలుపొందిన బిజెపి నేత మహేశ్వర్ రెడ్డిపై కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

ఆ పార్టీ నాయకులు ఆయనపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా స్థానికంగా ఉండకపోవడం ప్రజల సమస్యలను పరిష్కరించకపోవడం సీనియర్ నేతలను విస్మరించడంతో మహేశ్వర్‌రెడ్డిపై కేడర్‌తోపాటు యువకులు కూడా బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముధో ల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఎమ్మెల్యేపై వ్యతిరేకత లేనప్పటికీ రెండు వర్గా లు మాత్రమే ఆయన ప్రోత్సహిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 

మరొకసారి ఎన్నికల బరిలో..

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తేనే తమ రాజకీయ ఉనికి ఉంటుందని భావిస్తున్న గ్రామీణ లీడర్లు పార్టీ ముఖ్య నేతల మద్దతు కోసం కృషి చేస్తూనే గ్రామాల్లో వారి వారి అనుచర గణాన్ని ఎన్నికలకు సిద్ధం చేసుకున్న ట్టు తెలుస్తుంది. అయితే గత ఎన్నికల్లో గెలుపొందిన తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు మున్సిపల్ చైర్మన్లు తిరిగి మరొకసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహాన్ని సూపు తున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఆ పార్టీలో కష్టపడి పనిచేసిన పార్టీ ముఖ్య కార్యకర్తలు కూడా ఈ అవకాశాన్ని సద్విని చేసుకుని తమ రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు ఎన్నిక ల దోహదపడతాయని భావిస్తూ పల్లె ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంత ఓటర్లు మాత్రం ఏ పార్టీ ముగ్గు ఊపుతారోనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

రిజర్వేషన్లపై స్పష్టత కరువు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే బీసీ కులగలను చేపట్టి 42 శాతం బీసీలకు సీట్లు కేటాయిస్తామని ప్రకటిస్తూ చట్టం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. అయితే రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ ఈ ఎన్నికల్లో చట్టబద్ధంగా అమ లు అయ్యే అవకాశం లేదు. అయితే చట్టబద్ధత కాకపోయినప్పటికీ పార్టీ పరంగా బీసీలకు 42 సీట్లు కేటాయించి ప్రతిపక్షాలపై ఒత్తిడి తేవాలని పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం చేయడం బీసీల కు అత్యధిక సీట్లు వస్తాయని ఆశావాదు లు ఎదురుచూస్తున్నారు.

అయితే గత ఎన్నికల్లో కొనసాగించిన రిజర్వేషన్లు అమలు చేస్తారా కొత్త రిజర్వేషన్లు మారుస్తారని అంశంపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు కూడా రిజర్వేషన్ల ప్రక్రియను పక్కకు పెట్టి బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు వ్యూహం పన్నుతున్నారు. జిల్లాలో మూ డు అసెంబ్లీ స్థానాలు ఉండగా నిర్మల్‌లో బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి, ముధోల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఖానాపూర్‌లో అధికార పార్టీ వెడ్మ బొజ్జు పటే ల్ ప్రాతినిత్యం వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ విషయానికి వస్తే పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోగా గ్రామస్థాయిలో ఉన్న క్యాడర్ మొత్తం కాంగ్రెస్ బిజెపి వైపు మొగ్గు చూ పడంతో కొందరు లీడర్లు మాత్రమే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు.