calender_icon.png 8 August, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2 లక్షలకు చేరిన డిగ్రీ అడ్మిషన్లు

07-08-2025 12:00:32 AM

స్పెషల్ ఫేజ్‌లో 54 వేల సీట్లు కేటాయింపు

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ అడ్మిషన్లు దాదా పు రెండు లక్షలకు చేరినాయి. దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్లను బుధవారం విద్యార్థులకు కేటాయించారు. గత మూడు విడతల్లో 1,43,691 సీట్లు భర్తీ కాగా, తాజాగా స్పెషల్ ఫేజ్‌లోనే 54,048 సీట్లను కేటాయించారు. అంటే నాలు గు విడతల్లో కలిపి 1,97,739 సీట్లు భర్తీ అయ్యాయి. 2024 1,96,820 సీట్లు భర్తీకాగా, ఈసారి కాస్త పెరిగాయి.

త్వరలోనే దోస్త్ స్పాట్ అడ్మిషన్లను చేపట్టనున్నారు. ఆతర్వాత ఫార్మసీ విద్యార్థుల కోసం మరోసారి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌ను చేపట్టనున్నారు. దీంతో మరో సుమారు పది వేల వరకు సీట్లు భర్తీ అయ్యే అవకాశముందని తెలంగాణ ఉన్న త విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో 960 డిగ్రీ కాలేజీల్లో 4,38, 926 సీట్లకు గానూ ఇప్పటి వరకు 1,97,739 సీట్లు నిండాయి.

వీటిలో 823 ప్రభుత్వ, ప్రైవే ట్ కాలేజీల్లో 3,78,386 సీట్లకు 1,71,284 సీట్లు భర్తీ అయ్యాయి. 79 ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 23,614 సీట్లకు 11,329 సీట్లు నిండాయి. దోస్త్ పరిధిలో లేని 58 ప్రైవే ట్ కాలేజీల్లో 36,926 సీట్లకుగానూ 15,126 సీట్లు నిండాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి డిగ్రీ అడ్మిషన్లు రెండు లక్షలు దాటనున్నాయి. కానీ మొత్తం సీట్లతో పోల్చుకుంటే భర్తీ అయిన సీట్లు చాలా తక్కువనే.