calender_icon.png 9 August, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు

08-08-2025 11:01:33 PM

మహబూబ్ నగర్ జిల్లాకు పండుగ సాయన్న పేరు పెట్టాలి..

బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి..

మిడ్జిల్: బడుగు బలహీన వర్గాల ప్రజలకు పండుగ సాయన్న ఆదర్శప్రాయుడని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి ముదిరాజ్(BJYM District President Palle Tirupati Mudiraj) అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యంత ధీరునిగా సాహసవంతునిగా ఎదిగిన సాయన్న చిన్ననాటి నుంచి అన్యాయాలను ఎదిరించి పేదల పక్షాన నిలబడ్డారని కొనియాడారు.

ప్రజలను దోపిడీ చేస్తున్న భూస్వాములను ఎదురు తిరిగి అక్రమంగా దోచుకున్న ధాన్యాన్ని ధనాన్ని తన దగ్గర దాచుకోకుండా పేదలకు పంచిపెట్టిన వీరుడన్నారు. ప్రభుత్వం పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని అదేవిధంగా ఇలాంటి గొప్ప ప్రజా వీరుడు పేరును మహబూబ్నగర్ జిల్లా పేరు మార్చి పండుగ సాయన్న జిల్లాగా మార్చాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పట్నం జంగయ్య ముదిరాజ్, సంఘం నాయకులు రాజేశ్వర్, బండారి ప్రశాంత్, పల్లె శ్రీను, జమ్ముల శివ, ఎల్లుకండి కృష్ణయ్య, సుదర్శన్, పరశురాం, పల్లె అరవింద్, పల్లె లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.