23-07-2025 12:00:00 AM
కరీంనగర్, జూలై 22 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నది. ఇప్పటివరకు అధికార కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి నియామకంలో జాప్యం చేస్తుండటంతో కరీంనగర్ రూరల్, కొ త్తపల్లి మండలాలతోపాటు కరీంనగర్ నగర పాలక సంస్థలో టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులు గందరగోళంలో ఉన్నారు.
ఈ క్రమం లోనే కరీంనగర్ నియోజకవర్గం నుంచి ప్రా తినిధ్యం వహిస్తున్న గంగుల కమలాకర్ స్థా నిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పట్టును పదిలపర్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అటు స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఈ సారి కరీంనగర్ నగరంపై కాషాయ జెండా ఎగరవేయాలన్న పట్టుదలతో ఉన్నారు.
రెండు ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచగా, అధికార కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఈ సె గ్మెంట్లో దయనీయంగా ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ని యోజకవర్గ ఇంచార్జిలు పర్యటిస్తూ రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటే.. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మా త్రం స్తబ్దత నెలకొంది.
ఎవరికి వారే..
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2004 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం దక్కలేదు. 2009లో రెండో స్థానం దక్కించుకున్న హస్తం పార్టీ వరుసగా గత మూడు ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమయింది. గత ఎన్నికల వరకు కరీంనగర్ కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్న పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్కు వెళ్లారు. గత అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీలో చేరిన పురుమల్ల శ్రీనివాస్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.
అయినా ఫలితంలో ఏమార్పు లే కుండా మూడో స్థానానికే పరిమితమయిం ది. రాష్ట్రంలో పార్టీ అధికరంలోకి వచ్చినా.. కరీంనగర్లో మాత్రం పట్టు చిక్కలేదు. అసలే అంతంత మా త్రంగా ఉన్న స్థితిలో మంత్రి పొన్నం ను, ఇతర నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్ పార్టీ నుంచి నస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గానికి ఇంచార్జి లేకుండా పోయారు. జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు అనుచరులు వేర్వేరు కార్య క్రమాలు చేస్తూ ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
మూడు గ్రూపులుగా..
పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పదవి ఖాళీ గా ఉండటంతో పలువురు నాయకులు అ పదవిపై కన్నేశారు. అందులో ముగ్గురు మాత్రం తమకంటే తమకని సీరియస్గా పా వులు కదుపుతుండటం ఉత్కంఠ రేపుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్రావు, ఇటీవల గ్రాడ్యుయే ట్ ఎమ్మెల్సీగా పోటీచేసిన అల్ఫోర్స్ నరేందర్రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చై ర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మూడు గ్రూ పులుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడం కాకరేపుతోంది.
ఇంతకాలం లోలోపల మాత్రమే గ్రూపులుగా ఉన్న ఈ వ్యవహారం తాజాగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సభతో తేటతెల్లం అయింది. ము గ్గురు నాయకులు వేర్వేరుగా కార్యకర్తలను తరలించడంతో కాంగ్రెస్ మార్క్ రాజకీయం కాంగ్రెస్ సెగ్మెంట్లో మరోమారు బయటపడింది. వెలిచాల రాజేందర్రావు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కరీంనగర్ సీటు ఆ శించారు. కుదరకపోవడంతో అప్పటి హామీ మేరకే ఎంపీ టికెట్ దక్కింది.
తక్కువ వ్యవధిలో టికెట్ దక్కినా గట్టి పోటీ ఇవ్వగలి గారు. రాజేందర్రావు పేరును డీసీసీ అధ్యక్ష పదవికి కూడా పరిశీలిస్తున్నందున ఆయనకు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు ఇస్తా రా? లేక కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిలో ఎవరికో ఒకరికి దక్కుతుందా? అని కాంగ్రెస్ శ్రేణులు చర్చించు కుంటున్నాయి.
ఇదిగో, అదిగో అంటూ అధిష్ఠానం నియామకాలపై కాలయాపన చేస్తుం డటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఆశిస్తూ ఇప్పటి నుంచే ప్రచార పర్వంలో పాల్గొంటున్న నేతలు అయోమయంలో పడిపోతున్నారు. అయితే బీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రం కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు, బలహీనతలను ఆసరా చేసుకొని స్థానిక పోరులో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాయి.