23-07-2025 06:24:46 PM
కుభీర్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యతను విస్మరించొద్దని ఎంపీఓ మోహన్ సింగ్(MPO Mohan Singh) నిర్వాహకులకు సూచించారు. బుధవారం ఆయన మండల కేంద్రం కుబీర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. యూనిఫాంలో టెక్స్ట్ బుక్లు అందాయా అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం సట్ల గంగాధర్, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇదిలా ఉండగా మండలంలోని గాలి సింగ్ తండా ఖీరు నాయక్ తండలోని తదితర ప్రభుత్వ పాఠశాలలను ఎంఈఓ విజయ్ కుమార్ సందర్శించి విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.