22-07-2025 10:35:08 PM
మంచిర్యాల (విజయక్రాంతి): పట్టణంలోని రాజీవ్ నగర్ లో గల ఆదర్శ పాఠశాలలో మంగళవారం మెహందీ, బోనాలు పండుగ వేడుకలు తెలంగాణ సాంస్కృతి ఉట్టిపడే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలను ఉద్దేశించి ప్రిన్సిపల్ ముత్యం బుచ్చన్న మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించాలన్నారు. బోనాలు పండుగ మహంకాళి దేవికి అంకితం చేసిన హిందూ పండుగ అని, కృతజ్ఞతా రూపంగా దేవతకు బోనాలు (ప్రత్యేక భోజనం) సమర్పిస్తారని, దీనిని ఆషాడ మాసంలో, సాధారణంగా జూలై లేదా ఆగస్టు నెలలో జరుపుకుంటారన్నారు. బోనాల పండుగ, మెహందీ సందర్భంగా విద్యార్థులు, మహిళా టీచర్లు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు ఉత్సాహభరితమైన సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. గోరింటాకు పెట్టుకొని మెహందీ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.