calender_icon.png 24 July, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

23-07-2025 07:03:17 PM

టేకులపల్లి (విజయక్రాంతి): విద్యుత్ షాక్ తో ఓ ఎద్దు మృతి చెందిన సంఘటన టేకులపల్లి మండలం(Tekulapalli Mandal) అందులగూడెం బుధవారం చోటుచేసుకుంది. కుంటల్ల గ్రామానికి చెందిన రైతు గొగ్గేల కోటేశ్వరరావు వ్యవసాయ పనుల నిమిత్తం రోజువారీగా ఉదయాన్నే ఎడ్లను మేతకు విడువగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి స్తంభం తడిసి విద్యుత్ సరఫరా అవ్వడం జరిగింది. ఆ స్తంభాన్ని ఎద్దు తగలడంతో విద్యుత్ షాక్కు గురై ఆ ఎద్దు అక్కడికక్కడే మరణిచింది. ఈ ఎద్దును కోల్పోయిన రైతుకు విద్యుత్ అధికారులు, ప్రభుత్వంచే జరిగిన నష్టానికి న్యాయం చేయాలని కోరారు.