22-07-2025 10:39:16 PM
మణుగూరు (విజయక్రాంతి): పి.వీ కాలనీలోని సింగరేణి ఉన్నత పాఠశాలను జి.యం (ఎడ్యుకేషనల్) మురళీధర్ రావు(GM Muralidhar Rao) మంగళవారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు. పాఠశాల కంప్యూటర్, సైన్స్ ల్యాబ్స్, స్పో ర్ట్స్ రూమ్, లైబ్రరీలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో విద్యార్ధుల ప్రగతిని చర్చించారు. అలాగే పాఠశాలకు అవసరమైన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులందరూ కచ్చితంగా సమయపాలన పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుండే ప్రణాళికబద్ధంగా బోధన జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం వేణు, ఉపాధ్యాయులు మస్తానయ్య , కృష్ణబాబు పాల్గొన్నారు.