23-07-2025 06:21:49 PM
నగర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తా..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..
కొత్తపల్లి (విజయక్రాంతి): అభివృద్ధిలో కరీంనగర్ ను తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ గా తీర్చిదిద్దాలని, అందుకోసం మున్సిపల్ అధికారులు సమష్టిగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు(Constituency In-charge Velichala Rajender Rao) సూచించారు. అన్ని రంగాల్లో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ఆదర్శంగా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ నీ రాజేందర్ రావు కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లతో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు కరీంనగర్ నగర అభివృద్ధి పనులపై కమిషనర్ తో చర్చించారు.
కరీంనగర్ అభివృద్ధి విషయంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు అంశాలను చర్చించినట్లు రాజేందర్ రావు కమిషనర్ కు వివరించారు. కరీంనగర్ నగర ప్రజలు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడకుండా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ను ఆదర్శంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని తెలిపారు. అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, డిసిసి ఉపాధ్యక్షుడు మడుపు మోహన్, ఆకుల నర్సన్న, ఆర్ష మల్లేశం, గంట శ్రీనివాస్, కోటగిరి భూమా గౌడ్, మాచర్ల ప్రసాద్, కట్ల సతీష్, పాడిశెట్టి భూమయ్య, జక్కని ఉమాపతి, కోడూరి రవీందర్ గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్, సాజిద్, పిట్టల రవీందర్, లక్ష్మీనారాయణ, బొమ్మ ఈశ్వర్ గౌడ్, గడ్డం శ్రీరాములు, కర్ర రాజశేఖర్, విలాస్ రెడ్డి, పత్తేం మోహన్, లింగంపల్లి బాబు, మూల రవీందర్ రెడ్డి, బెతి సుధాకర్ రెడ్డి, ఆకుల ఉదయ్,కొలగాని అనిల్, గుమ్మడి రాజకుమార్,ఆటేపు వేణు, కమాటం అనిల్, ముద్దసాని క్రాంతి, బట్టు వరప్రసాద్, సిక్కిందర్, షేక్ ఖాన్, గడ్డం శ్రీనివాస్, జెరూపోతుల వాసు, మీరజ్ పాషా, గండి శ్యామ్, గండి గణేష్, గుర్రము అశోక్, శంకర్, బత్తిని కన్నయ్య గౌడ్, సిరాజ్, అనంతుల రమేష్, రాజేష్ బొబ్బిలి విక్టర్ తదితరులు పాల్గొన్నారు.