23-07-2025 06:55:15 PM
జనగామ (విజయక్రాంతి): తమిళనాడులో ఈనెల 17 నుండి 20 వరకు జరిగిన సౌత్ జోన్ నేషనల్ నెట్ బాల్ ఛాంపియన్షిప్(South Zone National Netball Championship) పోటీలో తెలంగాణ జట్టు టైటిల్స్ సొంతం చేసుకొని సత్తా చాటారు. అందులో ఐదుగురు క్రీడా కారిణిలు.. జోషిత సునయన, అర్చన, వైష్ణవి, శ్రుత కీర్తి, అక్షయ జనగామ జిల్లాకు చెందిన వారు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా(District Collector Sheikh Rizwan Basha) అన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను అభినందించి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి వెంకట్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, కోచ్ రవికుమార్ పాల్గొన్నారు.