23-07-2025 06:27:49 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) గా కె.అనిల్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh), అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో(Additional Collector Lenin Vatsal Toppo)లను కలిసి పూలమొక్క అందజేశారు. అనిల్ కుమార్ కి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, తహసిల్దార్ రాజేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, సునీల్ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.