23-07-2025 06:14:49 PM
కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్..
దేవరకొండ: డప్పు కళాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటానాని కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ యాదవ్(Congress Party Leader Srinivas Yadav) అన్నారు. బుధవారం గుమ్మడిపల్లి గ్రామంలోని దళిత సోదర కళాకారులకు 16 డప్పులను తన సొంత డబ్బులతో అందజేశారు. ప్రతి ఒక్కరికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ కళలను ప్రోత్సహించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంతులు, పరమేష్,రాము, రమేష్, కిరణ్, గోవర్ధన్, ఆనంద్, లాలయ్య, అంజయ్య, లింగం, బుచ్చయ్య, పెత్రయ్య, యాదయ్య, ముత్యాలు, ఈద్దయ్య, ప్రభాకర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.