23-07-2025 06:31:09 PM
వలిగొండ (విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ బుధవారం వలిగొండ మండలం(Valigonda Mandal) ఈ-పంచాయతి కంప్యూటర్ ఆపరేటర్ లు మండల అభివృద్ధి అధికారికి, మండల పంచాయతి అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని ఆన్ లైన్ పనులను సకాలంలో నిర్వహిస్తున్నామని తమ సేవలను గుర్తించి గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని వేతనాలు అందకపోవడంతో తమ కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని ఎప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ పంచాయతీ ఆపరేటర్లు భవాని, రమేష్, శివ పాల్గొన్నారు.