23-07-2025 06:36:53 PM
తరిగొప్పుల (విజయక్రాంతి): బుధవారం తరిగొప్పుల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(Kasturba Gandhi Girls School), ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా ఎమ్మార్వో సందర్శించారు. ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు వెళ్లిన ఎమ్మార్వో... ఈరోజు హాజరైన టీచర్ల వివరాలను రిజిస్టర్, అలాగే మధ్యాహ్న భోజనంకి సంబంధించిన రిజిస్టర్ లని పరిశీలించారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు. అందరికి యూనిఫామ్స్, నోట్ బుక్స్ వచ్చాయా, మధ్యాహ్న భోజనం బాగుంటుందా.. మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అని.. అలాగే ఫుడ్ కమిటీలో ఉన్న విద్యార్థులు ప్రత్యేకంగా... భోజనం నాణ్యత గురించి అడిగారు. కూరగాయలను, కిరాణం సామాగ్రిని ఎప్పటికప్పుడు చెక్ చేయాలన్నారు. చివరగా మధ్యాహ్న భోజన తయారీని పరిశీలించారు.
ఎంతమంది విద్యార్థులకు.. ఎంత క్వాంటిటీతో వంట తయారు చేస్తున్నారని... పరిశుభ్రమైన నీటితోనే వంట చేయాలని.. తాజా కూరగాయలను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు అన్ని అంశాలను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నరు చివరగా.. మండలంలోని ఫర్టిలైజర్ షాప్ లను ఎమ్మార్వో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాప్ ముందు పెట్టిన యూరియా నిల్వల బోర్డును ముందుగా పరిశీలించి... ఆ తర్వాత ఇప్పటివరకు ఎంత మంది రైతులకు యూరియా అమ్మారు? ఏ విధంగా అమ్మకాల ప్రక్రియ జరుగుతుంది, వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారు అని షాప్ యాజమాన్యంని అడిగి, ఈ సందర్బంగా ఎమ్మార్వో మాట్లాడుతూ... మండలంలో ఎలాంటి యూరియా కొరత లేదని... అనవసరంగా కొరత సృష్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పక్కాగా అమ్మకాలు జరగాలని.. ఏ రైతుకు ఎంత అమ్ముతున్నారో... వారి ఫోన్ నెంబర్ తో సహా అన్ని వివరాలను నమోదు చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో రామారావు ఏవో మనోహిత, ఏఈఓ ప్రవళిక, ఆర్ ఐ ఆంధ్రయ, తదితరులు పాల్గొన్నారు.