24-01-2026 01:17:30 AM
5వ తేదీన జంతర్‌మంతర్ వద్ద విజయవంతం చేయాలని టీచర్లకు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి పిలుపు
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు తప్పనిసరిగా ఉన్న టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (ఏఐఎఫ్‌టీవో) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎఫ్‌టీవో వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ టీఎస్ కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుల్గం దామోదర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో కొనసాగా లంటే టెట్ ఉత్తీర్ణతను రద్దు చేయా లని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం చూ పలేదన్నారు. దీం తో దేశవ్యాప్త ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేప ట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. చలో ఢిల్లీని ఉపాధ్యాయులు విజయవంతం చే యాలని కోరారు. జంతర్‌మంతర్ వద్ద నిర్వహించే ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా ఉపాధ్యా యులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్, అడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్‌రె డ్డి, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.