24-01-2026 01:19:34 AM
సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తం
చట్టాన్ని అతిక్రమించి పనిచేసే అధికారులు, పోలీసులకు మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): ‘ఉద్యోగ విరమణ పొందినా మిమ్మ ల్ని వదిలిపెట్టబోం. ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తాం’ అని చట్టాన్ని అతిక్రమించి పనిచేసే అధికారులు, పోలీసులను మాజీ మం త్రి హరీశ్‌రావు హెచ్చరించారు. దావోస్ నుంచి రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌ను అమలు చేయ డం కాదు, చట్టం, న్యాయబద్ధంగా వ్యవహరించాలని హితవు పలికారు. శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. మీకు ఏమాత్రం సహకరించబోం’ అని స్పష్టం చేశారు. ‘మీరు సొంత డబ్బులు, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగా ల్సి వస్తుందని తెలిపారు.
రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్‌లో పెట్టి ‘మా మీద ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం బీఆర్‌ఎస్ నేతలపై రాజ కీయ కక్ష సా ధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. కుట్రలతో బీఆర్‌ఎస్ నాయకులను బెదిరించాలని చూస్తున్న రేవంత్ పన్నాగం ఇది అని అన్నారు. ‘మేం తప్పు చేయలేదు. ఎవరికీ భయపడేది లేదు. కేటీఆర్ ధైర్యంగా వెళ్లారు’ అని చెప్పారు. అనేక సందర్భాల్లో బీఆర్‌ఎస్ నాయకులపై దుష్ప్రచారం జరిగిందని, ఆరోజు ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీస్తే, కేటీఆర్ మీద సోషల్ మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో వార్తలు రాయిస్తే ఏం చేశారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి మీద కూడా అధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.