20-09-2025 12:23:34 AM
నేరేడుచర్ల, సెప్టెంబర్ 19 : తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహా కమిటీసభ్యుడిగా ,హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ చైర్మన్ గా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ నియామకం పట్ల హుజూర్ నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం నేరేడుచర్లలో మాట్లాడుతూ నేమూరి శంకర్ గౌడ్ గత 20 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ,
జనసేన పార్టీ ఇంచార్జి గా పదవి బాధ్యతలు నిర్వహిస్తూ, ఎన్నో పోరాటాలు, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారని అన్నారు. పార్టీ నిర్మాణ దశ నుండి కష్ట పడి పని చేస్తున్న వ్యక్తిని పవన్ కళ్యాణ్ గుర్తించి ఈ పదవి ఇవ్వడం హర్షణీయమన్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ లో కూడా జనసేన పార్టీ బలోపేతం అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఉన్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మరాజు శ్రీను, కాటికం గోపాల్,శివ, వాసు, మట్టయ్య, ప్రసాద్, అర్జున్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.