19-09-2025 10:07:33 PM
-మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ యాకూబ్ పాషా
-రూ.30 కోట్లతో మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సహాయం
-అక్టోబర్ 6 లోపు నమోదుకు అవకాశం
కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ ‘రేవంతన్నా కా సహారా-మిస్కీన్‌ల కోసం’ అనే రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టిందని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకాల కోసం రూ.30 కోట్లు కేటాయించగా,ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ శుక్రవారం ప్రారంభమైందన్నారు.
ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’లో భాగంగా వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి పొందేందుకు రూ.50,000 గ్రాంట్ ఇస్తారని, రేవంతన్నా కా సహారా – మిస్కీన్‌ల కోసం ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి రూ.1 లక్ష గ్రాంట్ ఇస్తారని పేర్కొన్నారు. లబ్ధిదారులు తమ వివరాలను అక్టోబర్ 6వ తేదీలోగా tgobmms.cgg.gov.in వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని అన్నారు.