13-09-2025 12:21:18 AM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): బాచుపల్లి మండల పరిధిలోని సర్వే నెంబర్ 186 ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. మండల తహసీల్దార్ పూల్ సింగ్ ఆదేశాల మేరకు ఆర్ఐ భానుచందర్ తమ సిబ్బందితో కలిసి అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ గదులు నిర్మించి పేదలకు అమ్ముతూ లక్షల్లో సొమ్ముచేసుకుంటున్న ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. కబ్జాకు పాల్పడిన వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.