13-09-2025 01:41:48 AM
- దెబ్బతిన్న ఆర్‌అండ్ రోడ్లు
- ప్రతిపాదనలు పంపిన అధికారులు
- నిధుల మంజూరే ఆలస్యం...
కరీంనగర్, సెప్టెంబరు 11 (విజయ క్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు క రీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రహదారులు ఎ క్కువగా దెబ్బతిన్నాయి. ఈ రోడ్ల మరమ్మత్తులకు ఆర్ అండ్ బి కరీంనగర్ డివిజన్ సర్కిల్ పరిధిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడు ప్రాంతాల్లోని 1.17 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మత్తుల కో సం 11.3 లక్షలు, పూర్తిగా రోడ్లు పునరుద్ధరించేందుకు 23.75 కోట్లు అవసరం ఉం టుందని అంచనా వేశారు. అలాగే కరీంనగర్ జిల్లా పరిధిలో 15 ప్రాంతాల్లో ఓవర్ ఫ్లో కారణంగా నష్టంగా జరిగిందని, 3.17 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, ఈ ప నులకు 26.93 కోట్లు మొత్తం రెండు జిల్లాలో కలిపి 50 కోట్ల మేరకు నిధులు అ వసరం అవుతాయని అంచనా వేశారు.
తా త్కాలిక మరమ్మత్తులకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నుండినిధులు రాకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట మండలాల్లో అలాగే కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం, చిగురుమా మిడి మండలాల్లో ఆర్ అండ్ బి రహదారులపై రాకపోకలకు తరచు అంతరాయం ఏర్పడుతుంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి శ్రీనివాసనగర్, లింగాపూర్, వెల్ది, మామిడాలపల్లి, ఆర్నకొండ, నగునూరు, బా వుపేట, కొక్కెరకుంట, మోతె, పందికుంటపల్లి, గంగాధర రోడ్లు దెబ్బతిన్నాయి. రాజ న్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇల్లంతకుంట నుంచి సిద్ధిపేట రోడ్, జవహర్ పేట నుంచి నర్సక్క పేట రోడ్, వేములవాడ బై పాస్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలోని రహదారులు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
- హ్యామ్ రోడ్లనిధుల కోసం ఎదురుచూపులు...
కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి హ్యామ్(హైబ్రిడ్ యాన్యూటి మోడ్) పథకం కింద రూపొందించి రోడ్ల ప్రతిపాదనలను ఆర్‌అండ్ బి శాఖ ప్రభుత్వం ముందుంచిం ది. రోడ్ల విస్తరణతోపాటు నిర్వహణకుగాను 947.27 కోట్ల రూపాయలు అవసరం ఉం టుందని అంచనా వేశారు. మొత్తం 48 పనులకు సంబంధించి 616.41 కిలోమీటర్ల మేర పూర్తి చేయాలన్నది లక్ష్యం. హ్యామ్ పథకం కింద కొత్తవాటిని నిర్మించడమే పాత వాటిని మరమ్మత్తులు చేయడం, విస్తరించడం చేస్తా రు. ప్రధానంగా జిల్లా కేంద్రాలకు లింకు చేసే ఉద్దేశంతో ఈ హ్యామ్ పథకాన్ని రూపొందించారు. వరద నష్టం నిధులు, హ్యామ్ నిధులు మంజూరైతే ఆర్జిండి పనులకు మహార్దశరానుంది.