13-09-2025 02:08:03 AM
జర్నలిస్టుల అణచివేత ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం
అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం
‘ఎక్స్’ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ‘రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొం టున్న యూరియా కష్టాలను మీడియా ఎత్తిచూపితే కేసులు పెడతారా? జర్నలిస్టులను ఆంక్షల పేరుతో అణచివేస్తారా ? చానల్ రిపోర్టర్ సాంబశివరావుపై పోలీసులు అక్ర మ కేసులు బనాయించడం దుర్మార్గం’ మా జీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై కేసులు పెట్టడం రాష్ట్రప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
రైతులు రెండు నెలల నుంచి యూరి యా కోసం అష్టకష్టాలు పడుతున్నారని, అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్న మీడియా ప్రతినిధులను మాత్రం ప్రభుత్వం అణచివేయాలని చూస్తున్నదని ఆరోపించారు. పోలీసులతో శాంతిభ ద్రతలను కాపాడటాన్ని పక్కన పెట్టించి.. ప్రజల గొంతునొక్కేందుకు వాడడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వెం టనే స్పందించి జర్నలిస్ట్ సాంబశివరావుపై పెట్టిన కేసులను ఉప సంహరించాలని రాష్ట్రప్రభుత్వాన్ని, డీజీపీ జితేందర్‌ను డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల సర్కార్ కర్కశం
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పట్ల రాష్ట్రప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. కార్మికులు పెండింగ్ బిల్లులు, వేతనాల సాధన కోసం ధర్నాలు, నిరసనలు చేస్తున్నా రాష్ట్రప్రభు త్వం మొద్దు నిద్ర వహిస్తున్నదని నిప్పులు చెరిగారు. ఏడాది నుంచి బిల్లులు, వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వాటిని విడుదల చేసే వరకు కార్మికుల పక్షాన నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని నమ్మించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను నయవంచన చేస్తున్నదని దుయ్యబట్టారు. ఉన్నఫళంగా మధ్యా హ్న భోజన పథకం నుంచి కార్మికులను దూరం చేస్తే, వారి కుటుంబాల పరిస్థితేంటని వాపోయారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే కార్మికుల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రభు త్వం ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు, వేతనా లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.