26-11-2025 12:48:25 AM
-పోచారం మున్సిపల్ చౌదరిగూడలో అనుమతి లేకుండా షెడ్డు ఏర్పాటు
-స్థానికుల ఫిర్యాదు మేరకు కట్టడాన్ని కూల్చివేసిన హైడ్రా అధికారులు
-బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తమకు అమ్మినట్లు బాధితుల మొర
ఘట్‌కేసర్, నవంబర్ 25 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ చౌదరిగూడలో 800 గజాల అసైన్డ్ ల్యాండ్ కబ్జా చేసి వేసిన షెడ్డును హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేశారు. అసైన్డ్ ల్యాండ్ సర్వే 866, 867లో పర్మిషన్ లేకుండా నిర్మించిన కట్టడాన్ని నిర్మించడంతో హైడ్రా అధికారులు కూల్చివేశారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాకు అమ్మినట్లు బాధితులు మొరపెట్టుకున్నారు.
చౌద రిగుడా కాలనీవాసుల ఫిర్యాదు మేరకు కూల్చామని హైడ్రా అధికారులు తెలిపారు. అసైన్డ్ ల్యాండ్ కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. పర్మిషన్ లేకుండా కడితే కూల్చివేస్తామని, మళ్లీ పునరావృతం అయితే కేసులు నమోదు చేస్తా మని హైడ్రా అధికారులు హెచ్చరించారు.