calender_icon.png 26 November, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలను విస్మరించిన కాంగ్రెస్

26-11-2025 12:00:00 AM

  1. ఇబ్బందులు ఎదుర్కుంటున్న రైతులు
  2. రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్

కరీంనగర్, నవంబర్ 25 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించడంతో, ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన మీడియా సమావేశంలోమాట్లాడుతూ.. బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతతోనే బహుజన రాజకీయాధికారం సుసా ధ్యం అవుతుందన్నారు. యువతను రాజకీయాల్లోకి వచ్చేలా రాష్ట్రీయ లోక్ దళ్ ప్రోత్సహి స్తుం దని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఈ వర్గాలకు అధిక శాతం సీట్లు కేటాయించి, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కనీసం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం, 28 లక్షల వృత్తి నైపుణ్య శిక్షణలు పూర్తి చేయడం ప్రభుత్వ బాధ్యత అయినా, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

రైతుల ఆదాయ భద్రత కోసం పంటల బీమా తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశా రు. రైతుల పంట నష్టాలకు తగిన పరిహారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు బియ్యాల కృష్ణ, గౌర బీరప్ప, మడకం ప్రసాద్ దొర, రిషభ్, నరసింహరావు, బుల్లెట్ వెంకన్న కళా బృందం, తదితరులు పాల్గొన్నారు.