calender_icon.png 26 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్‌ఆర్ బయటికి పరిశ్రమలు!

26-11-2025 12:00:00 AM

  1. ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్‌కు రావద్దనే ప్రభుత్వ నిర్ణయం
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, నవంబర్ 25  (విజయక్రాంతి) : హైదరాబాద్‌ను  కాలుష్యం నుంచి విముక్తి కలిగించేందుకు నగరంలోని పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు బయటకి తరలించాల్సి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రకమార్క తెలిపారు. 50 ఏళ్ల కాలంలో హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున విస్తరించి ఇండస్ట్రియల్ పార్కుల చుట్టూ ఇళ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్ నగరానికి రావొద్దు అనేది ప్రభుత్వం ఆలోచనని, అందుకు పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌కు బయటికి తరలించాలని నిర్ణ యం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.

ప్రస్తుతం ఇండస్ట్రియల్ పార్కుల్లో ఉన్న వ్యక్తులను ఒత్తిడి చేసి బయటికి పంపలేమన్నారు.  నగరాన్ని పొల్యూషన్ రెడ్ జోన్ , ఆరెంంజ్ జోన్ల నుంచి విముక్తి కల్పించాలని కోర్టులు సూచించాయని, అందుకే పారదర్శకంగా సమగ్ర ఇండస్ట్రి యల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీని తీసుకువచ్చామని తెలిపారు.

అయితే, బీఆర్‌ఎస్ హయాంలో  ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ వారికి కావలసిన వారి కోసం,  క్యాబినెట్ అనుమతి కూడా లేకుం డా చేశారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ పార్కు లో కావలసిన వారికి భూములను కన్వర్ట్ చేశారని భట్టి ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలు ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్లు ఎన్ని చేశారు, ఎవరెవరికి చేశారో త్వరలోనే వివరాలను వెల్లడిస్తామన్నారు.

గత ప్రభుత్వ విధానమే కొనసాగిస్తున్నాం : మంత్రి ఉత్తమ్

నగరంలో ఉన్న పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటికి తరలించి, కాలుష్యరహిత ప్రాంతంగా చేయా లని గత ప్రభుత్వాలు ఆలోచన చేశాయని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా పరిశ్రమల తరలింపుపై ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు.

అయితే బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. పరిశ్రమల తరలిం పు అంశంపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేసిందని, దానిని తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని గుర్తు చేశారు. ఔటర్ బయటికి వెళ్లే పరిశ్రమలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లో ప్రభు త్వం రాయితీ కల్పిస్తోందన్నారు.

ఎంత నీచానికైనా దిగజారుతారు: జూపల్లి

రాజకీయ లబ్ధికోసం బీఆర్‌ఎస్ నాయకులు  ఎంత నీచానికైనా దిగజారుతారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టను దిగజార్చాలనే  దుష్ట ఆలోచన సరికాదని హితవుపలికారు. 2023లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఘోరంగా ఓడించినా బుద్ధి  రాలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రెఫరెండమన్న కేటీఆర్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని మంత్రి జూపల్లి నిలదీశారు. నగరంలో ఉన్న పరిశ్రమలను అవుటర్ బయటికి పంపాలని బీఆర్‌ఎస్ నుంచే ప్రయత్నం మొదలైందని, ఆ సమయంలో కేటీఆరే పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారని జూపల్లి గుర్తు చేశారు.