calender_icon.png 26 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల గొంతు కోశారు

26-11-2025 12:00:00 AM

  1. స్థానిక ఎన్నికల్లో తీవ్ర అన్యాయం
  2. రిజర్వేషన్లు 42 నుంచి 22 శాతానికి తగ్గిస్తారా?
  3. బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వే షన్ల కేటాయింపులో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని తెలంగాణ బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణ విమర్శించారు. 42 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి బీసీల గొంతు కోశారని మండిపడ్డారు. చాలా జిల్లాలలో 10 శాతం కూడా అమలు చేయలేదని అన్నారు.

మంగళవారం కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సం ఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లను 42 శాతం నుం చి 22 తగ్గించి బీసీల గొంతు కోశారని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే ఇం కొక వైపు చాలా జిల్లాలో కేటాయించిన 22 శాతం కూడా అమలు చేయడం లేదన్నారు. ఇది బీసీ లను నట్టేట ముంచడ మేనన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి శాస్త్రీయత లేకుండా అధికారులు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారన్నారు. జిల్లాను యూనిట్ గా తీసుకొని అధికారులు చేసిన మూలంగా బీసీలకు గతంలో జరిగిన పంచాయితీ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో తీరని తప్పుడు విదా నాల జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు బీసీ రిజర్వేషన్లను అతితక్కువగా కేటాయించడం మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు.

2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీ లకు 18 నుంచి 22 శాతం వరకు రిజర్వేషన్లను అమలు చేశారని, తాజా ఎన్నికల్లో 16 నుంచి 20శాతం వరకే రిజర్వేషన్లు కేటాయించారని ఆరోపించారు. ఈ సమావే శంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు జి అనంతయ్య, రాష్ట్ర బీసీ సంఘం అధ్యకుడు సీ రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ళ సతీష్‌కుమార్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బానాల అజయ్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి భీంరాజు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ శివకుమార్, అంజిగౌడ్, బీసీ యువజన సంఘం  ప్రెసిడెంట్ వర్కింగ్ తిరుమల గిరి అశోక్, జక్కా నాగేశ్వరరావు పాల్గొన్నారు.