21-11-2025 12:00:00 AM
రాజేంద్రనగర్ నవంబర్ 20 (విజయక్రాంతి) : శాస్త్రిపురం డివిజన్ లోని బంరుఖ్ నుదౌలా చెరువు ఎఫ్ టి ఎల్ విభాగంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చారిత్రాత్మకమైన బంరుఖ్ నుదౌలా చెరువు ఇఫ్టియల్ విభాగంలో వెలసిన అక్రమ నిర్మాణాలపై స్థానికు లు హైడ్రా ఆధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ అక్రమ నిర్మాలను పూర్తిగా పరిశీలించి గురువారం జెసిబీ సహాయంతో కూల్చివేశారు.
ఈ కూల్చివేతలకు ముందు అక్రమ నిర్మాణదారులు, హైడ్రా అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తతత వాతా వరణం నెలకొంది. మహిళార్ దేవ్ పల్లి పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హైడ్రా అధికారులు, ఎఫ్ టి ఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్ పరిధిలో ఏర్పాటు చేసిన నిర్మాణాలను నెల మట్టం చేశారు. హైడ్రా అధికారులు ఈ మధ్య కాలం లో 40కు పైగా అక్రమ భవనాలను కూల్చివేశారు.